బెల్లంకొండ, జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 08: బెల్లంకొండ మండల బిజెపి అధ్యక్షులు ఓర్చు రాజు మాట్లాడుతూ ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ఘన విజయం సాధించడం చాలా సంతోషం గా ఉందన్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా 20 సంవత్సరాల తరువాత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. భారతజాతి శ్రేయస్సే తన ద్యేయంగా బతికినా మన దివంగత భారత ప్రధాని అట్లాబీహార్ వాజ్ పేయి, ఆనాడు పార్లమెంటు సాక్షిగా, యేనటికైనా దేశమంతటా కమలం వికసిస్తుంది అన్న మాటని నిజం చేసే రీతిలో భారత దేశ అభివృద్ధికి పట్టం కట్టడంలో ఢీల్లీ ప్రజలు సఫలికృతులయ్యారని, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజల ఉన్నతికై అహర్నిశలు శ్రమించే బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించినందుకు వారికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.
Related posts
- Comments
- Facebook comments