కేసు దార్యాప్తు నందు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి …
అసాంఘిక కార్యక్రమాల పై కఠినంగా వ్యవహరించండి…
జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్.
సత్యసాయి జిల్లా,జనసేన బ్యూరో, ఫిబ్రవరి 08: శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా లో గల పోలీసు సబ్ డివిజన్ వారీగా డీఎస్పీలు, సిఐలతో లాంగ్ పెండింగ్ కేసులతోపాటు, ముఖ్యమైన కేసులపై సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా జిల్లాలోని ముఖ్యమైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ, ఫోక్సో, మర్డర్, చోరీ వంటి కేసుల గురించి ఆయా సబ్ డివిజన్ వారిగా ఆరా తీశారు.
ఇప్పటికే ముద్దాయిలు అరెస్ట్ అయిన కేసులలో త్వరిత గతిన ఛార్జ్ షీట్ దాఖలు చేసి, భాదితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెక్నాలజీ, ఈ సాక్ష్య ,యాప్ , డిజి లాకర్ యాప్ గురించి అధికారులకు వివరించారు. కేసులను దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ను ఉపయోగించి దర్యాప్తు ను వేగవంతం చేయాలి. ప్రతి స్టేషన్ పరిదిలో ప్రతి పోలీసు అధికారి మరియు సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంను అలవరచుకోవాలి. మహిళల, బాలికల బద్రత పై ప్రత్యేక శ్రద్ద చూపించి నూతన ప్రణాళికల రూపొందిం చాలన్నారు, స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని లేనియెడల వారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
సైబర్ నేరాల పై ప్రజలలో మరింత అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి స్కూల్ మరియు కాలేజీ విధ్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై ద్రుష్టి కేంద్రకరించి, గంజాయి, డ్రగ్స్, గ్యాంబ్లింగ్, మట్కా శిబిరాల దాడులు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబందించి డ్రోన్ సిసి కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ యెక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తెలుసుకోని వాటిని అనిచివేత అనిచివేత దిశ గా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిరోజు వాహనాల తనిఖీలు, బీట్స్, పెట్రోలింగ్, చేపట్టాలని , బోర్డర్ చెక్ పోస్ట్ లలో నిత్యం నిఘా ఉంచి అక్రమరవాణా పై అడ్డుకట్ట వేయాలని కోరారు గ్రామాలను, వార్డులను సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని ఎటువంటి తగాదాలు, మత ఘర్షణలు తదితర నేరాలపై పెప్పటికప్పుడు సమాచారం సేకరించి పై అదికారులకు తెలపాలి. రాత్రి వేళల్లో గస్తీ విధుల్లో అప్రమత్తంగా తిరుగుతూ పాత నేరస్థులను తనిఖీ చేసి నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
సిబ్బంది వెల్ఫేర్ మరియు సిబ్బందికి వారి రోజువారీ విదులలో ఎలాంటి విధులు అప్పజెప్పాలో అన్న విషయాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు వచ్చే విధంగా బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు గా డీఎస్పీలు విజయకుమార్ , మహేష్ , హేమంత్ కుమార్, ఆదినారాయణ ఎస్బి సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, డిసిఆర్బి సిఐ శ్రీనివాసులు, సైబర్ సెల్ సీఐ తిమ్మారెడ్డి, డిటిఆర్బి సిఐ సతీష్ ఐటి కోర్ ఇన్చార్జ్ సుదర్శన్ రెడ్డి, మరియు జిల్లా లోని ఇన్స్పెక్టర్ లు సిబ్బంది పాల్గొన్నారు.