జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఫిబ్రవరి 9: మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలో నీ అంబేద్కర్ కూడలి వద్ద బిజెపి మున్సిపల్ అధ్యక్షుడు కొమ్మిడి మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేశరాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపొందిన సందర్భంగా శనివారం సాయంత్రం విజయోత్సవ సంబరాలు జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పూలమాలలు వేశారు, జాతీయ రహదారిపై బిజెపి జెండాలు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దిల్లీ శాసనసభ ఎన్నికలలో ఓటర్లు బిజెపికి 27 సంవత్సరాల తరువాత అధికారం కట్టబెట్టడంతో పార్టీ ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ అధ్యక్షులు వి.హనుమాన్, నాయకులు గుండ్ల బాల్ రాజ్, కోటేశ్వరరావు, రామతీర్థ, విక్రాంత్రెడ్డి, మధుసూదన్ గౌడ్, వీరేశం, చంద్రశేఖర్, సి హెచ్ చంద్రకళ, ఆకుల పద్మ సిద్ది రాజ్, క్రిష్ణ యాదవ్, మమతశర్మ, అంజనేయులు, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Related posts
- Comments
- Facebook comments