గుంతకల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: పామిడి పట్టణంలోని వెంగమ నాయుడు కాలనీ లో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో శనివారం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువలో ఉంచిన 25 తులాల బంగారు, 80 వేల రూపాయలు నగదు అపహరించుకెళ్లారు. వెంగమ నాయుడు కాలనీ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి ఫోటో స్టూడియో పెట్టుకుని జీవిస్తున్నారు. శనివారం కసాపురం ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి ఆదివారం తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగలకొట్టడాన్ని గుర్తించి ఇంట్లోకి ప్రవేశించి చూడగా బీరువా తీసి ఉండటం, ఫైళ్లు, బట్టలు చల్లాచెదురుగా ఉండటం చూసారు.అందులో ఉంచిన 25 తులాలు బంగారు, 80 వేల రూపాయలు నగదును దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.