అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. టిడిపి అర్బన్ కార్యాలయంలో ఇవాళ 8వ విడత సీఎంఆర్ చెక్కులు ఆయన పంపిణీ చేశారు. మొత్తం 9మంది లబ్ధిదారులకు 9లక్షల 30వేల రూపాయల విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ గత 8 నెలల్లో 8 విడతల్లో 48మందికి 66.62 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కింద అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సాయం అందిందన్నారు. అడిగిన వెంటనే స్పందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు కష్టం ఉందంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ వచ్చిన దాఖలాలే కనిపించలేదన్నారు. కూటమి వచ్చాక నెలకు 10 మంది చొప్పున సిఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందుతోందన్నారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజులకే చెక్కులు వస్తున్నాయన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. 1వ తేదీన 98% పింఛన్లు ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తున్నామన్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేసి అవినీతికి తెర లైపారన్నారు. త్వరలో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 200 అన్న క్యాంటీన్లు వచ్చాయని.. త్వరలో మరో 200అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.