కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: అమలాపురం నియోజవర్గం అల్లవరం మండలం లో సంక్రాంతి సెలవులకు వాళ్ళ *పెద్దమ్మ ఇంటికి వెళ్లిన కేత లాస్య (5 సం:) విద్యుత్ వైర్లు తగిలి అపస్మారక స్థితిలో కి వెళ్ళి పోయింది. వెంటనే లాస్యను కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. పరిస్థితి విషమించుటతో ఆమె కుడి చేతిని తీసివేయడం జరిగినది. లాస్యకు జరిగిన పరిస్థితిని తెలుసుకోవడానికి తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ దాన కర్ణుడు, తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ అయిన గుత్తుల మీరా కుమార్, లక్ష్మీ దంపతులు కాకినాడ జిజిహెచ్ లో ఉన్న కేతా లాస్య పరిస్థితిని చూసి చలించిపోయి ఆమె తండ్రికి లక్ష రూపాయలు అందజేసినారు. దీనిపై మీరా కుమార్ మాట్లాడుతూ దీనికి కారణమైన అమలాపురం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వైఫల్యం వలన కేతాలాస్య పరిస్థితి దయనీయంగా మారింది.
దీనికి కారణమైన అమలాపురం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలని అలాగే రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ మరియు అమలాపురం ఎమ్మెల్యే అయితబత్తుల ఆనందరావు ఈ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని అలాగే లాస్య తల్లికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించాలని గుత్తుల మీరా కుమార్ కోరినారు. తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శెట్టిబలిజ *దాన కర్ణుడు మరియు గుత్తుల సూర్యనారాయణ వారసుడు గుత్తుల మీరా కుమార్ సతీమణి లక్ష్మీ దంపతులు కాకినాడ ఇంద్ర పాలెం గ్రామానికి చెందిన కేత లాస్యకు లక్ష రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో గుత్తుల మీరా కుమార్ తో పాటు హైదరాబాద్ కు చెందిన పిల్లి నాగబాబు, చైతన్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కర్రీ శివరామకృష్ణ, కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంఘం నాయకులు పంపన మురళి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి కాకినాడ జిల్లా అధ్యక్షులు రాయుడు మోసేస్ బాబు, జ్యోతిరావు పూలే సంఘ నాయకులు కడలి రత్న శేఖర్ మరియు గుత్తుల సాల్మన్ దొర (విజయవాడ)తెలుగు జనతా పార్టీ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ మునగాల సాయి గోపి, తెలుగు జనతా పార్టీ కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంఘ అధ్యక్షులు *పితాని శ్రీనివాసరావు, కరప మండలం తెలుగు జనతా పార్టీ ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షులు నడే వెంకటరమణ, పెద్దాపురం నియోజవర్గం శెట్టిబలిజ సంఘం నాయకులు పెంకె వేణుగోపాల్ (గోపి) మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.