అల్లీనగరం బీసీ హాస్టల్ ను, జిల్లా పరిషత్ పాఠశాలకు మార్పు చేయండి..
ఒంగోలు జడ్పీ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..
గిద్దలూరు, జనసేన ఆర్.సి. ఇంచార్జి (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టర్ భవనంలో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా కొమరోలు మండలం, అల్లీనగరం గ్రామంలో ఉన్నటువంటి బీసీ వసతి గృహం, శిదిలావస్తకు చేరటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు వసతి గృహాన్ని మార్పు చేయాలని కోరగా, సంబంధిత మంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా 544 జాతీయ రహదారి పై జరుగుతున్న వరుస ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సంఘటనల పై స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను, మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.