పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 09: రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు , జగరాజుపల్లి ,బ్రాహ్మణపల్లి ,పుట్టపర్తి సాయి ఆరామం కళ్యాణ మండపంల్లో ఆదివారం పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ కుటుంబ సభ్యుల కుటుంబాలకు చెందిన పలు వివాహా కార్యక్రమాలకు హాజరై అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 మాసాల్లోనే గ్రామాల్లో సిసి రోడ్లు వీధిలైట్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజల సొమ్ముతో జగన్ ప్రభుత్వం విలాసవంతమైన కార్యక్రమాలను చేపట్టడం వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి పోయిందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టి ఎక్కిస్తూనే ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్న సమర్థుడు మన ముఖ్యమంత్రి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఈ ఎనిమిది మాసాల్లోనే పెన్షన్ల పెంపుతో పాటు జగన్ పాలనలో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, 16వేల టీచర్ పోస్టులను భర్తీ చేసే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఏడాదికి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రూ.20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద అందించే కార్యక్రమాన్ని కూడా చేపడుతోందని వెల్లడించారు.
అంతేకాకుండా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం కార్యక్రమం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15000 రూపాయలు అందించే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని తెలిపారు. మంచి చేసే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు కొత్త చెరువు ,పుట్టపర్తి ,బుక్క పట్నం టిడిపి మండల కన్వీనర్లు విజయకుమార్ శ్రీనివాసులు ,రామకృష్ణ , సాలెక్క గారి శ్రీనివాసులు, సామకోటి ఆదినారాయణ ,శ్రీరామ్ రెడ్డి ,పుల్లప్ప, శ్రీ రామ్ నాయక్ ,బొమ్మయ్య, జయప్రకాష్, బేకరీ నాయుడు ,గంగాధర్ నాయుడు, రామారావు ,పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.