సత్తెనపల్లి,ఫిబ్రవరి12,జనసేన ప్రతినిధి.…
సత్తెనపల్లి పట్టణం లో జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
పల్నాడు జిల్లాఎస్పీ కంచి శ్రీనివాసరావు.
వారితో పాటు సత్తెనపల్లి ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి,తహసీల్దార్ చక్రవర్తి,మున్సిపల్ కమీషనర్ షమ్మి,డీఎస్పీ హనుమంతురావు ఉన్నారు.
కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పట్టభద్రుల ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ర్యాoపుల ఏర్పాటు, అవసరమైన నిరంతర విద్యుత్ అందించేలా మరియు మంచినీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు.క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సమయంలో ఓటర్లు ఎండ తీవ్రతకు గురికాకుండా ఉండే విధంగా టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు….