జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో సమావేశం…..
క్రోసూరు,ఫిబ్రవరి 11,జనసేన ప్రతినిధి…..
మండల కేంద్రమైన క్రోసూరు లోని జై భారత్ స్కూల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పై టీచర్లతో జరిగిన సమావేశంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి విజయంలో ఉపాధ్యాయుల పాత్ర అధికంగా ఉందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఉపాధ్యాయుల పూర్తి మద్దతుతో కూటమి అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలుపొందేలా కృషి చేయాలని అన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ఇటీ వల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజాను గెలిపించి కూటమి ప్ర భుత్వ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు, మంచి పాలనకు అండగా నిలవాలి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు యువత ప్రాధాన్యమని, చదువుకున్న యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేదుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సమాజంలో మంచిని త్వరగా గ్రహించగలుగుతారని వారంతా కూడా కూటమిపాలను అండగా ఉండి ఆలపాటి రాజాకి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి చక్కటి విజయాన్ని అందించాలని కోరారు.ఈ కార్య క్రమంలో వరప్రసాద్ బుజ్జి, ఏపూరి నాగేశ్వరరావు, కాండ్రు కాశయ్య,సలాం, మన్నెం శ్రీను,దూళ్ల సాంబయ్య,మొగల్ జానూ , హస్సను,దుద్దుల యోహాను, యర్రంశెట్టి రామకృష్ణ,సురేష్, మాస్టర్,నలజాల కోటేశ్వరరావు,సదాశివరావు, జై భారత్ స్కూల్ డైరెక్టర్ జైనేంద్రరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు….