బెల్లంకొండ, ఫిబ్రవరి 14, జనసేన ప్రతినిధి
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు కీర్తిశేషులు దామోదర సంజీవయ్య జయంతి మరియు పుల్వామా డే వీర మరణం చెందిన సైనికులకు ఘనంగా నివాళి ప్రిన్సిపల్ మరియు డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్యాధికారి ఘనంగా నివాళులర్పించినారు విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలని ఉపాధ్యాయులను పెద్దలను గౌరవించాలని మన దేశానికి రక్షణగా ఉన్న పుల్వామా దాడిలో మరణించిన సైనికులకు ఘనంగా నివాళులు దేశాన్ని ప్రేమించాలని దేశభక్తి కలిగి ఉండాలని డాక్టర్ శ్రీనివాస్ తెలియపరిచారు మరియు విద్యార్థిని విద్యార్థులకు పరీక్షల పైన అవగాహన మరియు ఆరోగ్యం పైన వైద్య_ _శిబిరం డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ వైద్య అధికారి. ఈ_ కార్యక్రమంలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలను నివృత్తి చేస్తూ వారికి పబ్లిక్ ఎగ్జామ్స్ పై ఉన్న భయాన్ని తొలగిస్తూనే వారికి పలు సూచనలు ఇస్తూ వారు సాధించే విజయం తల్లిదండ్రులకు ఒక రిటర్న్ గిఫ్ట్ అని అది వారికి అత్యంత అనుభూతిని ఇస్తుంది అని చెబుతూ ప్రేరణ కలిగించడం జరిగింది. లక్ష్యాలను నిర్దేశించి, వాటిని సాధించడం, సమయ నిర్వహణ, చదవడంలో పాటించాల్సిన మెళకువలు, పరీక్షా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన వాటి గురించి విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి-
ప్రణాళిక ప్రకారం చదవాలి —
సమయపాలన –
అర్థం చేసుకుని చదవాలి – నిద్ర,, ఆహారం కూడా ముఖ్యం
బ్రహ్మీ ముహూర్తం నిద్ర లేసి కండ్లు చల్లటి నీటితో కడుక్కుని చదవడం వల్ల బాగా గుర్తుంటుందిఎవరెవరి .అనుకూలం అది.కానీ సమయపాలన ముఖ్యం . చదివేది అర్థం చేసుకుని చదవాలి
మూడు ఆరుల పద్ధతి పాటించవలెను, ఒకటి రీడ్- చదువుట, రెండవది రీ కలెక్టింగ్- తిరిగి మననం చేయడం, మూడవది తిరిగి వ్రాయుట చేయవలెను
చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన ఉంటే వాటిని ఒక దగ్గర చేసుకోవడం మంచిది. అప్పుడు ఉపాయోగపడతాయి.
చదివిన జవాబు అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి.
చదివింది అయ్యాక అంశాన్ని పరీక్షల సమయంలో ఆరేడు గంటలు లు తప్పకుండా నిద్రపోవాలి .పరీక్షల సమయంలో కూడా 6 ,7 గంటలపాటు నిద్ర ఉండేట్టు చూసుకోవాలి.నిద్ర మేల్కొని చదివితే తీరా పరీక్షముందు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. తిండి విషయంలో కూడా తగుజాగ్రత్తలు సాధ్యమైనంతవరకు కంద, ఆరటి పండు, సాత్వికాహారం తీసుకొనవలెను సీజన్లో లభించే ఫ్రూట్స్ కూడా తీసుకోవలెను తీసుకోవాలి. సమయానికి తిని బాగా చదువుకోవాలి మీ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యాధికారి సైకాలజిస్ట్ ,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ శారద పాల్గొని ఆయుష్ మందులను బ్రహ్మి గ్రూతము పంపిణీ చేయడం జరిగింది మరియు సత్యప్రభ కవిత లెక్చరర్స్ విద్యార్థిని విద్యార్థులు ఆయుష్ సిబ్బంది వెంకట రామయ్య పాల్గొన్నారు.