పట్టించుకోని అధికారులు…
ఇప్పటికైనా స్పందించాలని కాలనీ వాసుల వేడుకోలు…
క్రోసూరు మండలం,ఫిబ్రవరి 13,జనసేన ప్రతినిధి…
క్రోసూరు మండల కేంద్రలోని ఎ స్సీ కాలనీ పరిసర ప్రాంతంలో సీసీ రోడ్ల మధ్య తీసిన గుంతలు
పూడ్చాలని కాలనీ వాసులు కోరారు.సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గుంతలు
పూడ్చక పోవటంతో ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు తెలిపారు రాత్రి వేళలో వృద్ధులు,చిన్నారులు పడి దెబ్బలు తగులుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు..ఆటోలు, ద్విచక్ర వాహనాలు తిరిగేటప్పుడు ప్రమాదాలకి గురి అవుతున్నాయని కాలనీ వాసులు వాపోతున్నారు.. ఇకనైనా తీసిన గుంతలు పూడ్చాలని కోరుతున్నారు….