*పాఠశాలల ఆయాలు, వాచ్మెన్ల జీతాలు విడుదల*
గత జగన్ సర్కారు బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు, వాచ్మెన్ల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నాడు-నేడు పేరుతో రంగులు వేసి రూ.వేల కోట్లు దిగమింగిన వైకాపా పాలకులు.. కనీసం పాఠశాలల్లో ఆయాలు, వాచ్మెన్లకు జీతాలను సైతం ఇవ్వలేదు. టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్‌కు కూడా నిధులివ్వలేదు. ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని అధికారులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తేవడంతో సంబంధిత బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయాలు, వాచ్మెన్ల జీతాలకు రూ.64.38 కోట్లు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు రూ.25.52 కోట్లు చొప్పున మొత్తంగా రూ.89.9 కోట్ల బకాయిలు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.