Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన కూటమి నాయకులు…

కాకినాడ, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మద్దతుగా కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడు గ్రామంలో కూటమి నాయకులు ప్రచారం నిర్వహించారు. సమర్థుడు, విద్యావంతుడు, తన సేవా కార్యక్రమాలతో ఇప్పటికే ఒక మంచి పేరు సంపాదించుకున్న పేరాబత్తుల రాజశేఖరం ను పెద్దల సభకు పంపాలని వారంతా గ్రామంలోని పట్టభద్రులను కలిసి విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ తమ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు పోలింగ్ విధానాన్ని పట్టభద్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి సెంట్రల్ కమిటీ సభ్యులు, కాకినాడ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మేకా లక్ష్మణరావు, కాకినాడ రూరల్ మండలం తెదేపా ప్రధాన కార్యదర్శి కోడి సీతారామయ్య, రమణయ్యపేట తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షులు కాళ్ల శ్రీనివాసరావు, టి.ఎస్.ఎన్.ఎఫ్ నాయకుడు పాలిక సతీష్, కూటమి నాయకులు కాకరపల్లి శ్యాంసుందర్రావు, పంపన ఉమా మహేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, ఎమ్. రోహిత్ కుమార్, పాలిక శివ, బందరు అజయ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment