భూదాటి మహాలక్ష్మమ్మ రోటరీ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సుబ్బయ్య తోట ను సందర్శించిన చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి అనంతవరం శ్రీనివాసరావు, శనివారం సాయంత్రం పాఠశాలను సందర్శించడం జరిగింది. పాఠశాల లో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన వివిధ కార్యక్రమాల గురించి, విద్యార్థుల బోధనభ్యసన కార్యక్రమాల గురించి వివరాల అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు పాఠ్య పుస్తకాలు తీసి విద్యార్థులు చదివించడం జరిగింది, రిజిస్టర్లు రికార్డులు తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే పాఠశాలలో ఎంఈఓ ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం,పాఠశాలను సందర్శించిన ఎంఈఓ ను ప్రధానోపాధ్యాయులు లేళ్ళ వెంకటరెడ్డి శాలువాతో సత్కరించారు.విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు…
