ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ అనిత తిరుమలరెడ్డి (స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ హాస్పిటల్ చిలకలూరిపేట) మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే పరీక్షలు మంచిగా రాయగలరని మీ జీవితానికి మీరే బాటలు వేసుకుని పరీక్షలు ముగిసే వరకు ఒత్తిడి ఆందోళన దరిచేరనీయకుండా ప్రశాంతంగా ఉండాలని అన్నారు. అతిథిగా విచ్చేసిన మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గాదే రాణి మాట్లాడుతూ ఒక వ్యక్తి చదువుకొని కుటుంబంలో స్థిరపడితే ఆ తర్వాత మూడు తరాలు అభివృద్ధి చెందుతాయని విద్యే విలువైన ఆస్తి సంపద అని అన్నారు. హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు మాట్లాడుతూ మనిషిని శక్తివంతునిగా తయారు చేసేది ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువచ్చేది చదువు మాత్రమే అని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ షేక్ అష్ర ఫూన్ మాట్లాడుతూ హెల్ప్ ఫౌండేషన్ గత ఆరు సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణి చేయడమే కాకుండా ప్రేరణ తరగతులు నిర్వహిస్తూ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగిందని హెల్ప్ ఫౌండేషన్ వారికి డాక్టర్ అనితకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు…

