2025 మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపట్ల లోని ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ లో మార్చి 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ‘ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీలు’ అనే అంశం పై నిర్వహించనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమం లో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా నుండి సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి,పంచాయతీ కార్యదర్శి చిలువూరి కృష్ణ ప్రసాద్ ఎంపిక అయినట్లు సత్తెనపల్లి ఎంపిడిఓ బండి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.ఈ శిక్షణా కార్యక్రమం లో రాష్ట్ర స్థాయి లో ఒక్కో జిల్లా నుండి ఎంపిక అయిన 26 మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ ల సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొంటున్నారని ఎంపిడిఓ వెల్లడించారు…..
Related posts
రాజుపాలెంలో100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సర్పంచ్ పసుపులేటి వెంకటస్వామి
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా…పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా… పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం…
- Comments
- Facebook comments

