ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు వెల్లడి….
ఈ నెల 8 వ తేదీ నుండి ప్రారంభం కానున్న పి 4 సర్వే( ప్రభుత్వ ప్రవైట్ ప్రజలు భాగస్వామ్యం ద్వారా పేదల ఇంటింటి అభివృద్ది) గురించి సత్తెనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బండి శ్రీనివాస్ రెడ్డి రెండు బ్యాచ్ లు గా మండలం లోని మొత్తం సచివాలయాల సిబ్బంది కి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పీ 4 సర్వే ను 08-03-2025 నుండి 18-03-2025 లోపు పూర్తి చేసి అతి నిరు పేదలు ఉన్న 20 శాతం కుటుంబాలను గుర్తించి గ్రామసభ ల ద్వారా ఆమోదించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటం జరుగుతుంది అని ఎంపిడిఓ వెల్లడించారు. ఈ నేపథ్యం లో ప్రజలు సర్వే కి సహకరించాలని ఎంపిడిఓ కోరారు.గ్రామం లో ప్రజా ప్రతినిదులు ఈ సర్వే గురించి ప్రజలను చైతన్య పరచి ప్రజలు సర్వే పూర్తి చేయటానికి పూర్తి సహకారం అందించేలా చూడాలని ఎంపిడిఓ
పిలుపునిచ్చారు. ఈ సర్వే ద్వారా అందిన సమాచారం ఆధారంగా ‘జీరో పావర్టీ – పీ 4 పాలసీ’ అనే కార్యక్రమాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తున్నట్లు ఎంపిడిఓ వెల్లడించారు…..


