ఉపాధి హామీ కూలీల వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి 12వ తేదీ అనగా రేపు విజయవాడలో జరగనున్న ధర్నాని ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి జి రవిబాబు అన్నారు ఈరోజు క్రోసూరులోని ఆమంచి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశంలో రవిబాబు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం కల్పిస్తున్న వంద రోజులు కుటుంబాలకు చాలటం లేదని అన్నారు సమ్మర్ అలవెన్స్ మజ్జిగ మంచినీళ్లు పలుకు పారా అలవెన్సులు కూడా ఇవ్వటం ద్వారా కూలీలకు ఇస్తున్న వేతనం పెరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదని పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు అదేవిధంగా వ్యవసాయ పనులు సరిగా లేక జిల్లాలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పలనాడు జిల్లాకి ఇతర రాష్ట్రాలు జిల్లాల నుండి వలస కార్మికులు పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్న సందర్భంలో ప్రమాదం జరిగి ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వము నష్టపరిహారం ప్రకటించడం చేయటం లేదని దీనివల్ల ఆ కుటుంబాల లో ఉన్నటువంటి చిన్న పిల్లలు వృద్దులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదంలో చనిపోతున్నటువంటి వలస వ్యవసాయ కూలీల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు సాగుభూమి ఇవ్వాలని ఇటువంటి సమస్యల పరిష్కారం చేయాలని జరుగుతున్న ధర్నాలో ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఏపూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు…
