సత్తెనపల్లి రూరల్ మండలం
లక్క రాజు గార్లపాడు గ్రామంలో నాగమయ్య స్వామి తిరుణాల సందర్భంగా ముందుగా స్వామివారిని దర్శించుకొని అనంతరం గ్రామ ప్రజలు ఏర్పాటు చేసిన సభలో ముందుగా గజ్జల నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ….
ఈసారి జగనన్న 2.0 చూస్తామని తప్పకుండా మన సత్తెనపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మీ అందరూ నా తమ్ముడు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి కి అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన సమన్వయకర్త
డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ…


ముందుగా ఈ తిరుణాలకు నన్ను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్న అని వచ్చే ఎన్నికల్లో నాకు మీ అందరూ అండదండగా ఉండి మన సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని అలాగే జగనన్నను సీఎం చేసుకోవాలని తెలియజేస్తూ కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, రాష్ట్ర రైతు సలహా మండలి మాజీ సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చిలక జైపాల్, గ్రామ మాజీ సర్పంచ్ శివయ్య, అనుబంధ విభాగాల బాధ్యులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.