Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ కమిటి ఆధ్వర్యంలో తనిఖీలు

పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణ పల్నాడు రోడ్డులోని హోటళ్ళలో బుధవారం తనిఖీలు నిర్వహించారు. 

టి స్టాల్ లో వినియోగిస్థున్న లూజ్ పాలు,టి పొడి సాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. ఫ్రిడ్జ్ లో వున్న పెరుగు, మజ్జిగా ప్యాకెట్లు, కూల్ డ్రింక్స్ మరియు బాధంపాల ముగింపు తేదీలను తనిఖీ చేసారు. అలాగే హోటళ్ళలో పరిసరాల శుభ్రత పాటించాలని, ఫ్రిడ్జ్ లను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలని,

డస్ట్ బిన్ ఏర్పాటు చేసి వాడిన టీ కప్పులను అందులో వేసేలా చూడాలని, టీ తయారు చేసే పాత్రలను ప్రతి రోజు శుభం చేయాలని హోటల్ యజమానులకు తెలియజేసారు. అలాగే వినియోగించే వస్తువుల ముగింపు గడువు ప్రతి రోజు పరిశీలించి గడువు ముగిసిన వస్తువులను తొలగించాలని సిబ్బందికి సూచించారు.

ఈ సందర్బంగా పల్నాడు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ మీడియతో మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యపాలు కాకుండా ఉండేందుకు రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు జిల్లాలో వివిధ ప్రాంతాలలో తనికీలు నిర్వహించి నిబంధనలు పాటించని హోటళ్ళు మరియు షాపులపై కేసులు రాయటం జరిగిందని,

అందులో భాగంగా నరసరావుపేట పట్టణంలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ త్వరలో జిల్లాలోని అన్ని హోటల్స్ మరియు రెస్టారెంటులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కూడా తనిఖీ చేయడం జరుగుతుందని,

నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో వీరితో పాటు ఎ.పి. వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర క్రియాశీల కార్యదర్శి కె.కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment