గిద్దలూరు, జనసేన ప్రతినిధి (ఏప్రిల్ 30):ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం నరవ గ్రామ పంచాయితీ సర్పంచి బండి శ్రీనివాసులు ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా బుధవారం బండి శ్రీనివాసులు ను నరవ గ్రామ సచివాలయంలో “జనసేన వార్తా పత్రిక” ప్రకాశం జిల్లా బ్యూరో కట్టా రమేష్ ఆధ్వర్యంలో మార్కాపురం డివిజన్ ఇంచార్జి వేశపోగు రమేష్, గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జి షేక్ అహమ్మద్ బాషా మరియు గిద్దలూరు రిపోర్టర్ షేక్ మహమ్మద్ ఖాశిం మెమెంటో అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉత్తమ సేవా పురస్కారం లభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.