సత్తెనపల్లి, జూన్ 12,జనసేన ప్రతినిధి…

12వ జాతీయ స్థాయి బీచ్ కబాడీ మెన్ అండ్ ఉమెన్ 5-6-2025 to 8-6-2025 నాలుగు రోజులు మచిలీపట్నంలో జరిగిన జాతీయస్థాయి బీచ్ కబాడీ పోటీలలో దేశంలోని 29 రాష్ట్రాలు క్రీడాకారులు పాల్గొన్నారు.పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించి సాధించి ఇండియా జట్టుకు మన పల్నాడు క్రీడాకారులు సెలెక్ట్ అయిన వారిలో కృష్ణారెడ్డి, గోపి,హరీష్ వీరిని పల్నాడు జిల్లా కబాడీ జిల్లా అధ్యక్షుడైన మాబు, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అచ్చిరెడ్డి, రియాజు,శేషయ్య, అనీలు, కబాడీ అసోసియేషన్ సభ్యులు సందీప్,సురేషు, ఆనందు వీరందరూ కలిసి క్రీడాకారులను సత్కరించారు. అలానే పల్నాడు జిల్లా కబాడీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన బాబు క్రీడాకారులను ఉద్దేశించి ఇంటర్నేషనల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చినారు.