: దాల్ మిల్లర్లతో సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు
నరసరావు పేట, జులై 10, జనసేన ప్రతినిధి….

కంది ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కందులు కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు కోరారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మిల్లర్లు మెరుగైన ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు.
ఈ వారంలోగా రైతులకు, మిల్లర్లకు ఆమోదయోగ్యమైన ఒక ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా
నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు.
గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కందుల కొనుగోలుపై జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, ఆర్డీవోలు మధులత, రమణాకాంత్ రెడ్డి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
DIPRO,Palnadu