అచ్చంపేట మండలం
ఇసుక అక్రమ తవ్వకాలు ,రవాణా , ఇసుక అక్రమ నిల్వలపై అధికారులు చర్యలు చెప్పట్టారు…


అచ్చంపేట మండలం కృష్ణానది పరిసర ప్రాంత గ్రామాలైన చామర్రు ,అంబడిపూడి గ్రామాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు…
12 ఇసుక డంపింగ్ లను గుర్తించి సీజ్ చేశారు…
ఇసుక అక్రమ తవ్వకాలను అదుపు చేయటానికి మండల స్థాయిలో అన్ని శాఖల తోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు…
తహశీల్దార్ ,ఎంపీడీఓ ,రెవెన్యూ, మైనింగ్ పంచాయతీరాజ్, పోలీస్ శాఖ ,ఇరిగేషన్ శాఖలతో ఒక కమిటీని ఏర్పాటు చేసారు…
ఈ కమిటీ ద్వారా తనిఖీలు చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు…
చామర్రు లో బుధవారం అనుమతులు లేకుండా అనధికారికంగా నిల్వచేసిన 12 ఇసుక కుప్పలను సీజ్ చేశారు.
కోనూరు గ్రామంలో 3స్టాక్ పాయింట్లు , అంబడిపూడి గ్రామంలో 4స్టాక్ పాయింట్లు అధికారికంగా ఏర్పాటు చేసామని ,ఇక్కడి నుండి అనుమతులు తీసుకొని ఇసుక తీసుకుని వెళ్ళాలని తహశీల్దార్ తెలిపారు….