Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

నందిగామ లో పొలం పిలుస్తుంది..

కార్యక్రమం నిర్వహించిన ఏఓ సుబ్బారెడ్డి…..

సత్తెనపల్లి మండలం లోని నందిగామ గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమం సత్తెనపల్లి మండలం వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇంకా ఎవరైనా లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి అర్హుల జాబితా లో లేని వారు మీ గ్రామం లోని రైతు సేవ కేంద్రం నందు సిబ్బంది ద్వారా అన్నదాత సుఖీభవ పోర్టల్ నందు రైతు వివరాలు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. ప్రస్తుతం ప్రత్తి పైరు లో తామర పురుగు గమనించటం జరిగినది అని నివారణకు ఎసిఫేట్ 350 గ్రాములు లేదా ఏసిటామిప్రిడ్ లేదా థైయోమిథాక్సమ్ 40 గ్రా. లేదా పిప్రోనిల్ 400 మీ లీ 200 లీటర్లు నీటిలో కలిపి పది రోజులకు మందులను మార్చుతూ పిచికారీ చేయాలి అని తెలిపారు. మరియు ప్రత్తి పంట చుట్టూ జొన్న లేదా మొక్క జొన్న కంచే పంటగా 2-3 వరసలు నాటినట్లైతే రసం పీల్చే పురుగులను ఆశించకుండా నివారించవచ్చు. వరి పంటను సాగు చేసే రైతు కట్టవలసిన ప్రీమియం ఎకరాకు రూ. 80/_ చెలించినచో పంట దిగుబడి తగ్గినట్లయితే దాని ఆధారం గా భీమా మొత్తం రూ.40000/_ పొందవచ్చని తెలియ జేశారు. వరి పంటను సాగు చేసే రైతులు ఆగస్టు 15, 2025 లోపు పంటల భీమా కొరకు ప్రీమియం చెల్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో సత్తెనపల్లి మండలం వ్యవసాయ అధికారి  బి సుబ్బారెడ్డి , నందిగామ గ్రామ నాయకులు తాతినేని సాంబశివరావు, ఆళ్ల అనంత కోటేశ్వరరావు,  రైతులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment