June 2, 2026
Janasena News Paper
అంధ్రప్రదేశ్ఈ-పేపర్గుంటూరుతాజా వార్తలు

కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Related posts

Leave a Comment