ప్రైవేటు పాఠశాలలకు
రిజిస్ట్రేషన్ గడువు 19వరకు
అమరావతి:
🔶️విద్యా హక్కు చట్టం కింద 25% ప్రవేశాలకు ప్రైవేటు పాఠశాలలు రిజిస్ట్రేషన్ చేసు కోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 19లోపు విద్యాసంస్థలు, 22 నుంచి ఏప్రిల్ 11వ రకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 18న పాఠశాలల ప్రవేశాల మొదటి విడత ఫలి తాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. సీబీఎస్ ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు, రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు జూన్ ఒకటో తేదీ నాటికి ఐదేళ్లు నిండి ఉండాలని పేర్కొంది.