జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు
భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని స్పష్టీకరణ
వచ్చే ఏడాది తన పుట్టిన రోజు వేడుకలకు జగన్ ను సీఎం గా మళ్లీ చూడాలని ఆశాభావం
శెట్టిబలిజ సామాజిక వర్గంలో నూతనోత్తేజాన్ని నింపిన పితాని జన్మ దిన వేడుకలు
కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 20: వైస్సార్సీపీ బీసీనాయకులు, రమ్య హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పితాని అన్నవరం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీనగర్ రమ్య హాస్పిటల్ లో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, హాస్పిటల్ సిబ్బంది సమక్షంలో డా.పితాని కేకు కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా డాక్టర్ పితాని అన్నవరం మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపినారు.వైస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు.మళ్లీ జగనే సీఎంగా నెగ్గాలని, విద్య వైద్య సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. మరింత సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాలని ఆయన ప్రార్థించారు.రమ్య హాస్పటల్ సిబ్బంది, రమ్య కాలేజీ ఆఫ్ నర్సింగ్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు డా.పితాని అభిమానులు పాల్గొన్నారు.
వైసీపీ కార్యకర్తలు,అభిమానుల్లో నూతనోత్సాహాన్ని నింపిన ఈ జన్మదిన వేడుకలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో నిబద్ధతతో, క్రమశిక్షణ గల కార్యకర్తగా అంచులంచులుగా నాయకునిగా రూపుదిద్దుకున్న పితాని అన్నవరం తన సేవా కార్యక్రమాలు ద్వారా అదిష్టానం పెద్దల వద్ద మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా ఉత్సాహం చెందకుండా తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సక్రమంగా నివర్తించి శభాష్ అనిపించుకున్నారు. మొదట రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి, తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ స్థానానికి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా,ఏమాత్రం నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఓ పక్క తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ మరోపక్క విద్య, వైద్య పరంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయంగా కూడా పార్టీ కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న పితాని పార్టీ అగ్ర నాయకుల్లో మంచి విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. అయితే గతంలో కోల్పోయిన అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కచ్చితంగా తనకు అవకాశం కల్పిస్తామని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో అధిష్టానం ఆదేశాల ద్వారా రూరల్ ఎమ్మెల్యే కాకినాడ పార్లమెంట్ స్థానానికి వెళ్లినా లేదా ఆయన సొంత జిల్లాలో పోటీకి మొగ్గు చూపినా కచ్చితంగా కాకినాడ రూరల్ టిక్కెట్ ఇతర అన్నవరనికే కేటాయించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు.
రాజకీయంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడు పైగా ఆర్థికంగా దన్ను ఉన్న ఉన్నటువంటి డాక్టర్ పితాని అన్నవరానికి రూరల్ టికెట్ కేటాయిస్తే గెలుపు సులభం అవుతుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు. గత ఎన్నికల్లో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించడానికి విశేష కృషి చేసిన శెట్టిబలిజ సామాజిక వర్గం అనేక కారణాలవల్ల పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఆ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత కల్పించిన ఎమ్మెల్యే క్రమంగా తమ సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు తమను అసలు పట్టించుకోవడం లేదని పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కానీ జగన్ పై అభిమానంతో పార్టీని వీడలేని కొంతమంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు ఇప్పటివరకు సందిగ్ధంలో ఉండిపోయారు.
అయితే రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని కాకినాడ రూరల్ టిక్కెట్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది అని పైగా టికెట్ కచ్చితంగా అధిష్టానాన్ని మన్ననలు పొందిన పితాని అన్నవరానికి దక్కుతుందని గ్రహించిన నాయకులు ఆయనకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఈ విషయం స్పష్టంగా తేటతెల్లమైంది. జిల్లా నలుమూలల నుంచి ముఖ్యంగా రూరల్లోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా వందల మంది వైసీపీ అభిమానులు పుట్టినరోజులు వేడుకల్లో పాల్గొని అన్నవరానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలు , అభిమానులు నడుమ పితాని జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరగడంతో రూరల్ వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని స్పష్టంగా చెప్పవచ్చు.కార్యక్రమం శెట్టిబలిజ నాయకులు కండిపల్లి వెంకటరమణ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, ప్రముఖ న్యాయవాది కడలి వెంకటనారాయణ, దొమ్మేటి వెంకటరెడ్డి సేవా సమితి కన్వీనర్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు వీరేంద్ర , యువకులు అనసూరి సతీష్ , గుత్తుల రామ్ ప్రసాద్, కడలి రాంపండు , వాసంశెట్టి త్రిమూర్తులు తదితరులు పాల్గొని పితానికి శుభాకాంక్షలు తెలియజేశారు.