Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వ్యక్తిగత సమస్యలు తెలుసుకుంటూ… ఆర్థిక భారోసా

గడప గడపకు మన ప్రభుత్వం”లో పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల,

గోరంట్ల జనసేన ప్రతినిధి మే 02: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ఓ వైపు వివరిస్తూ, మరోవైపు ప్రజల వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు పెనుకొండ ఎమ్మెల్యే మంగళవారం గోరంట మండలం పాలసముద్రం పరిధిలోని బిల్లలచెరువు మిషన్ తండా పప్పుల తండా గ్రామాల్లో  ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం చేపట్టారు.అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటా తిరిగిన ఎమ్మెల్యే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆయా కుటుంబాలకు కల్గిన లబ్దిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి పేరుతో వచ్చిన లబ్ధిపత్రాలను వారికి అందజేశారు. చేకూరిన లబ్ధికి సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి పంపారని ఎమ్మెల్యే తెలిపారు.గతంలో ఎప్పుడూ ఇలాంటి పాలన చూడలేదని మహిళలు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతి ఇంటికీ ఆర్థిక లబ్ధి జరిగింది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబం లక్షల రూపాయలు సాయం పొందారు. ఏయే పథకాల వల్ల ఎంత మేలు జరిగిందో తెలియజేసేందుకు ముఖ్యమంత్రి జగనన్న మీ వద్దకు పంపాడు. జగనన్న పాలన ఎలా ఉంది తల్లీ…. అని ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్నారాయణ అడిగారు. మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ పథకాల ద్వారా లక్షల రూపాయలు మా ఖాతాల్లో పడ్డాయని పథకాల కోసం ఎవరికీ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో పథకాలు అమలు కావాలంటే గ్రామాల్లో ఉండే జన్మభూమి కమిటీ సభ్యుల ఇళ్ల చుట్టూ తిరిగామన్నారు. అర్హత ఉన్నా చాలామందికి పథకాలు అందలేదని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని ఆనందంగా చెప్పారు.

ఇలాంటి ప్రభుత్వం పదికాలాల పాటు ఉండాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సాయం చేయాలి. అండగా నిలబడాలనే పెద్ద మనుసు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని వర్గాలను వంచించారన్నారు. మరోమారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, స్టోర్ డీలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment