అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ..
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులకు బెయిల్ మంజూరు చేయాలని సోమవారం న్యాయవాదులు వేసిన పిటిషన్ అన్నమయ్య జిల్లా మదనపల్లె ఏడిజె కోర్టు న్యాయమూర్తి అబ్రహాం కొట్టి వేశారు. ఈ నెల నాలుగో తేదీ అంగళ్ళు, పుంగనూరు అల్లర్లు సృష్టించిన టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు తదితర ముద్దాయిలకు బెయిల్ ఇవ్వవద్దని పి.సుధాకర రెడ్డి, అడ్వకేట్ జనరల్ ఎస్. దుష్యంత్ రెడ్డి, ఏపీపీ తమ వాదనను గురువారం మదనపల్లి ఏడిజే అబ్రహాంకు విన్నవించారు. అయితే ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారానికి నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ఇరువురి వాదనలు పరిశీలించి అన్ని బెయిల్ పిటిషన్లు ఏడిజే ధర్మాసనం నిరాకరించగా టీడీపీ ఖంగుతింది. వస్తుందనుకున్న బెయిలు రాకపోవడంతో టిడిపి నాయకులు భంగపడ్డారు..