మేడ్చల్,(జనసేన ప్రతినిధి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్ చింతల్కు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్ పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. డబిల్ పూర్ వైపు నుంచి నూతనకల్ వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం, నూతనకల్ గ్రామం నుంచి డబిల్ పుర్ వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనాలు ఢీకొని రాకేష్(21)ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిక తరలించారు.
- Comments
- Facebook comments