
*సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి జాతీయస్థాయి గుర్తింపు*
స్థానిక సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కు నేషనల్ అసెస్మెంట్ ముస్కాన్ ప్రోగ్రామ్ క్రింద క్వాలిటీ కంట్రోల్ మీద అవార్డు అందుకోవటం జరిగింది.
జిల్లా సమన్వయ అధికారి బివి రంగారావు మాట్లాడుతూ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ పల్నాడు జిల్లాలోని ఎంతో అభివృద్ధి చెందిన హాస్పిటల్ గా రూపొందుతుందని చక్కటి కమిటీ సభ్యులు ఉండటంవల్ల నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని కొనియాడారు.
ముస్కాన్ సర్టిఫికెట్ వచ్చినందుకు సత్తెనపల్లి ఏరియా హాస్పటల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ మాట్లాడుతూ చిన్నపిల్లల వార్డు, నవజాతి పిల్లల వార్డు క్వాలిటీ కంట్రోల్ ను పరీక్షించిన కేంద్ర బృందం సంతృప్తి చెందటంతో ఈ సర్టిఫికెట్ అందజేశారని దానికి కాను చిన్నపిల్లల వార్డును కార్పొరేట్ స్థాయికి మించి సౌకర్యాలు కల్పించామని డాక్టర్లు స్టాఫ్ నర్సులు అందరూ ఒక టీం వర్క్ చేయడం వల్ల ఇది సాధ్యమైందని ఎంతో క్లిష్టతరమైన ఈ సర్టిఫికెట్ అందటం ఆనందకరమని అభివృద్ధి కార్యక్రమాల్లో అంబటి రాంబాబు గారి ప్రత్యేక చొరవ ఉండటం మాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను తెలియజేశారు.
హాస్పటల్ మెడికల్ సూపర్డెంట్ లక్ష్మణరావు మాట్లాడుతూ సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి ఒక అరుదైన అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని దీనికి ముఖ్య పాత్ర పోషించిన హాస్పటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కొత్త రామకృష్ణ కి మరియు హాస్పటల్ డాక్టర్లు డాక్టర్ సుజాత గారికి మరియు ప్రేమ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముస్కాన్ అనే కార్యక్రమం ఎంతో కఠిన తరమైన ఆంక్షలుతో కూడిన సర్టిఫికెట్ అలాంటి సర్టిఫికెట్‌ని పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి కి లభించటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ సూపర్డెంట్ లక్ష్మణ్ రావు, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రేమ, డాక్టర్ శోభారాణి, నర్సింగ్ సూపర్డెంట్ రాధ, ఎంబీఎస్సీ కౌన్సిలర్ రంగనాయక్, స్టాఫ్ నర్సులు మొదలగు వారు పాల్గొన్నారు