పది రోజులుగా తెలుగు గంగ నీరు రాక జీవకోన, గోవింద నగర్ ప్రజలు ఎదురుచూపు..
ఇతర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాలన్న భారీ వర్షం కారణంగా ఎటు పోలేక నానా ఇబ్బందులు..
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 4 తిరుపతి / – పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని లీలా మహల్ సెంటర్ సమీపంలోని లీలా మహల్ జంక్షన్ సమీపంలోని కరకంబాడి రోడ్డు జీవకోన, గోవింద నగర్ ప్రాంతాలలో పది రోజుల నుండి తెలుగు గంగ నీళ్లు రాక పోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల నుండి నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక వాలంటీర్లు లకు వివరించామని గేట్ వాల్ పనిచేయడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని వాలంటరీలు సమాధానం ఇస్తున్నారని సమస్య గురించి ఎవరికీ వివరించాలో అర్థం అవ్వట్లేదని స్థానికులు ఆవేదనకి గురవుతున్నారు.
గేట్ వాల్
సిద్ధమయ్యేంతవరకు రెండు ప్రాంతాలకు మున్సిపాలిటీ అధికారులు ట్యాంకర్ ల ద్వారా నీళ్లు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మూడు రోజుల నుండి తిరుపతి పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయని కాళ్లు బయట పెట్టాలన్న ఇబ్బందిగా ఉందని వీటికి తోడు నీళ్లు రాకపోవడంతో చాలా కష్టంగా ఉందని రెండు ప్రాంతాల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నారు.
««««««««««««»»»»»»»»»»»