Janasena News Paper
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని చట్ట విరుద్ధమైన ఆటలు నిర్వహిస్తే కఠీన చర్యలు: అన్నవరం Si కిషోర్ బాబు

కాకినాడ జిల్లా అన్నవరం జనసేన ప్రతినిధి జనవరి 12:  అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రానున్న సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని సంప్రదాయ క్రీడల ముసుగులో కోడి పందాలు, పేకాటలు, గుండాటలు, వంటి చట్ట విరుద్ధమైన ఆటలు నిర్వహిస్తే నిర్వహుకులు పై కరిన చర్యలు తీసుకుంటామని అన్నవరం Si కిషోర్ బాబు అన్నారు. అదే విధంగా పండుగలకు ఊరు వెళ్లే వారు అందరూ ముందుగా పోలీస్ స్టేషన్ లో తెలియపరిస్తే వారి ఇంటికి సీసీ కెమెరాలు,, పోలీస్ పహారా ఏర్పాటు చేస్తామని Si తెలిపారు. ముఖ్యంగా యువత పండుగ హడావిడిలో తాగి డ్రైవ్ చేయకూడదు అని ఆ వారి పై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.

Related posts

Leave a Comment