*శ్రీ లక్ష్మీ హాస్పిటల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న పలువురు నేతలు
జనసేన ప్రతినిధి, అమలాపురం, ఫిబ్రవరి 4:
డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కాలేజ్ రోడ్ లో నూతనంగా నిర్మించబడిన భవనం లో ఆదివారం శ్రీ లక్ష్మీ హాస్పటల్ ప్రారంభోత్సవం సందర్భంగా హాస్పటల్ డాక్టర్ పి.అనిల్ కుమార్ ను మాజీ ఎంఈవో మరియు జేజే రావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జంగా రాజేంద్ర కుమార్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు యనమదల వెంకటరమణ, సీనియర్ అడ్వకేట్ యార్లగడ్డ రవీంద్ర కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు పుష్ప గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీల నేతలు పాల్గొన్నారు.