- స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం
- హిందూపురంలో వడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ
అనంతపురం జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04 :స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయమని పావగడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతప్ప పేర్కొన్నారు. ఆదివారం హిందూపురం శ్రీకంఠపురంలోని వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరణకు పావగడ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హనుమంతప్ప ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ.. మా కర్ణాటక రాష్ట్రంలో ప్రతిసారి 7, 8మంది మంది ఎమ్మెల్యేలతో ఉంటున్నామని, ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా వడ్డెర్లను గుర్తించకపోయిందని, మీరు గొర్రెల్లాగా పార్టీల జెండాలు మోసుకుంటూ పార్టీ ఇన్‌చార్జ్‌లకు బానిసలాగా మారి పబ్లిక్ మీటింగ్‌లో మాత్రం మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలంటూ.. తర్వాత ఇన్‌చార్జ్ దగ్గరకు పోయి ఎన్ని రోజులైతే బానిసత్వంతో బతుకుతారో అన్ని రోజులు మీకు ఏ రాజకీయ పార్టీలు గుర్తించవని తెలియజేశారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి పార్టీలకతీతంగా ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి టికెట్ ఇస్తారో.. ఆ పార్టీ వెన్నంటే నడవాలని, లేనిపక్షంలో నాకు ఒక్కసారి నా కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఢల్లీిలో పార్టీ పెద్దలు ఐ కమాండ్ నాకు టికెట్ ఇవ్వనందున నేను పావుగడ నియోజకవర్గం నందు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 16వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందానని, అప్పుడు పార్టీ పెద్దలే నా దగ్గరికి వచ్చి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా మీరు కూడా 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోతే మీరు అనంతపురం ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల్లో రెండు పార్లమెంటులో ఇండిపెండెంట్‌గా నిలబడి మన ఓట్లు మనం వేసుకుని సత్తా చూపించాలని మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో సుబ్బారావు వెంకటేశ్వరరావు, శ్రీదేవి, జరిపిటి కృష్ణమూర్తి వడ్డే సిమెంట్ పోలన్న, డీఎస్పీ వేణుగోపాల్, జరపటి అశ్వద్ధప్ప, మల్లెల జయరాం, పల్లపు జయచంద్ర మోహన్, దండగల మారెప్ప రాష్ట్ర వడ్డెర సంఘం ముఖ్య నాయకులు, సత్యసాయి జిల్లా వడ్డెర సంఘం నాయకులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.