మెంటాడలో అగ్నిప్రమాదం
మెంటాడ,ఫిబ్రవరి05,జనసేన ప్రతినిధి:మెంటాడ మండలం సంతతోటలో పూరిల్లులో దేశాబత్తుల చిరంజీవి పూరి ఇంట్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యింది. చిరంజీవి భార్య రమణమ్మ నిండు గర్భిణీ కావడంతో గజపతినగరం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని మంత్రి రాజన్నదొర పరామర్శించారు. వీరితోపాటు సర్పంచ్ రేగడి రాంబాబు, నాయకులు సిరిసిట్టి నారాయణరావు,తదితరులు ఉన్నారు.