జనసేన ప్రతినిధి పాచిపెంట : సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం కర్రివలస పంచాయతీకి చెందిన బాలి వెంకటి (65)అనారోగ్య కారణాలతో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదే సచివాలయంలో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పని చేస్తున్న తెర్లి మోసెస్ విజయనంద్ శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంకు వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలి వెంకటికి పెన్షన్ అందించారు. ఉద్యోగి సొంతం డబ్బులతో పక్క జిల్లా కేంద్రంకు వెళ్లి పెన్షన్ అందించడం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగి విజయనంద్ ని ప్రశంసిస్తున్నారు.
