Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.



వలిగొండ ఏప్రిల్ 08(జనసేన )

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుండి తొర్రూరు వరకు జరుగుతున్న రోడ్డు పనులు విస్తరణలో భాగంగా వలిగొండ దగ్గర లోతుకుంట గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు మరో పక్క పెద్ద పెద్ద గుంతలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి అదే చోట సరైన సూచిక బోర్డులు, రేడియం చారికలు లేక రాత్రి వేళలో వెళ్లే ప్రయాణికులకు మార్జిన్ కనిపించక తికమక పడుతున్నారు. అసలే ఎండాకాలం వచ్చి పోయే వాహనాల దుమ్ముతో బైకు ,ఆటోలలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన దమ్ము, ఇసుక విపరీతంగా  లేవడంతో   ప్రయాణికులు కండ్లల్లో పడి ప్రమాదాలు బారిన పడబోతున్నారు రోడ్డుపై నీళ్లు చల్లకుండా కాంట్రాక్టర్లు తప్పించుకొని వారి పనులను ముగించుకుంటున్నారు.ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ కోరారు.

Related posts

Leave a Comment