అల్వాల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డేది
అధికారుల కనుసన్నల్లోనే అడ్డగోలు నిర్మాణాలు
కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
అక్రమ కట్టడాలు అందరికీ ఆసరా పథకాల్ల మారాయి
అల్వాల్ మున్సిపాలిటీ ఆదాయానికి భారీ గండి
అక్రమ కట్టడాలు నిబంధనాలకు విరుద్ధంగా అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణాలు ముమ్మరంగా జరగడంతో అల్వాల్ మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టాలని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాలపై దృష్టి పెట్టాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్న సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదని సర్వత్రా విమర్శలు వినబడుతున్నాయి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పైనుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు అధికారులే అండగా ఉన్నందున అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదంటూ పలు విమర్శలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంలో అక్రమ నిర్మాణాలు అధికారులకు సైతం ఆసరా పథకముల ఉపయోగ పడుతుందని స్థానికులు విమర్శిస్తున్నారు.అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినప్పటికీ అల్వాల్ మున్సిపాలిటీ పరిధిలో అవెంపట్టించుకోకుండ ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా కమర్షియల్ షెడ్లు నిర్మించి నిబంధనలు విరుద్ధంగా మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కమర్షియల్ హాజులు నిర్మిస్తూ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనీ కొందరు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోక పోవటం దేవుడెరుగు నిబంధనలకు పాటించకుండా భవనాలు,షెడ్లు నిర్మిస్తున్న అక్రమ దారులకే అధికారులు అండగా నిలుస్తున్నారని బహిరంగ విమర్శలు చేస్తున్నారు
. అల్వాల్ మున్సిపాలిటీ అధికారులు అక్రమ కట్టడాలను ప్రోతహిస్తు అక్రమ కట్టడాలను నిర్మించడమే కాకుండా కొన్ని చోట్ల తన శెడ్లకులకు అడ్డు ఉన్న హరితహారం చెట్లను గుట్టుచప్పుడు కాకుండా నరివేసి అక్రమ ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ షెటర్లను నిర్మించారు. స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారుల అండదండలు ఉండటంతోనే అధికారులు సైతం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు ఇప్పటికైనా జోనల్ కమిషనర్ స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న అల్వాల్ లోని ఐస్ ఫ్యాక్టరీ రోడ్డులో అక్రమల నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు.