
అమలాపురం, జనసేన ప్రతినిధి, ఏప్రియల్ 28: అమలాపురం మండలం ఇందుపల్లి అరవ గరువు శ్రీ బాల భక్త గణపతి సేవా సంఘం ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలి అర్పించారు. బాల భక్త గణపతి సేవా సంఘం అధ్యక్షుడు టి.కె. విశ్వనాధ్ ఆధ్వర్యంలో అమలాపురంలో గల హరి మనోవికాస కేంద్రం మానసిక వికలాంగ పిల్లలకు పళ్ళు మరియు వారి నిత్యవసరాలు ఉపయోగపడే సామగ్రి, సానిటరీ సామగ్రిని అందజేయడం జరిగింది. అనంతరం భూ పయ్య అగ్రహారం లో గల లూయి అందుల పాఠశాల విద్యార్థులకు పళ్ళు, బిస్కెట్లు, డ్రింక్స్ పంపిణీ చేయడం జరిగింది. అందుల పాఠశాల రిపైర్స్ నిమిత్తం కొంత విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పేరి రామకృష్ణ, టి. ఎస్.ఎస్.ఎస్ శర్మ, శిష్ట సుందర రామయ్య,పేరి అజిత్ శర్మ లు పాల్గొన్నారు.

