
స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే మా లక్ష్యం
నిర్భయంగా ఓటు వేయండి… ప్రశాంత ఎన్నికలకు సహకరించండి.
ఆత్మకూరు మండలం పంపనూరులో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న జిల్లా ఎస్పీ.
అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12:ఎన్నికల వేళ… ఏవైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆత్మకూరు మండలం పంపనూరులో ఈరోజు కేంద్ర సాయుధ బలగాలచే నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ లో ఎస్పీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎస్పీ ప్రజలతో మాట్లాడారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలే మా లక్ష్యమన్నారు. నిర్భయంగా ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలని కోరారు. గోడవలు, అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు సి.ఐ నరేంద్రరెడ్డి, ఎస్సై మునీర్ అహ్మద్ మరియు కేంద్ర సాయుధ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.