జనసేన ప్రతినిధి, అమలాపురం,మార్చి 02: అయినవిల్లి మండలం నేదునూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అటల్ ల్యాబ్ టింకరింగ్ సైన్స్ ప్రదర్శన పాఠశాల గెజిటెడ్ ప్రధానం ఉపాధ్యాయులు పి.ఎన్.వి.వి ప్రసాద్ రావు అధ్యక్షతన శనివారం సమావేశం జరిగినది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిలు గా జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు విచ్చేసి విద్యార్థినీ విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ఫెయిర్ యాంత్రికరణ మెటీరియల్ ను సందర్శించి వారి నైపుణ్యతను తిలకించి మీరు ఇంకా ఈ యొక్క యాంత్రికరణలను తయారుచేసి మంచి సైన్షియస్టులుగాను, ఇంజనీర్లుగాను తయారవ్వాలని వారిని కొన్ని ఆడినారు అలానే ఈ నేదునూరు హై స్కూల్ విద్యార్థులు ఇటీవల జనవరి నెల విజయవాడలో జరిగిన దక్షిణ భారత వైవిజ్ఞాన ప్రదర్శనలో రోడ్డు ఫ్యూచర్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ని విద్యార్థులు పి. గౌతం, పి. గణేష్ తయారుచేసి రాష్ట్ర స్థాయి బహుమతి సాధించినారు ఈ విద్యార్థులను పాఠశాల తరఫున సన్మానించినారు హై స్కూల్ అభివృద్ధి నిమిత్తం ఎంపీటీసీ 1 కల్లేపల్లి సుబ్బరాజు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ 1 కల్లేపల్లి సుబ్బరాజు , మాజీ సర్పంచ్ వాసంశెట్టి తాతాజీ, పిసీ కమిటీ చైర్మన్ పి. వెంకటరమణ, వైస్ చైర్మన్ కె. శ్రీదేవి, మాజీ పీస్ చైర్మన్ బండి శ్రీరాములు, తిప్ప చైతన్య, వస్తా రామారావు సైన్స్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాయినిలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
previous post
Related posts
- Comments
- Facebook comments