Janasena News Paper
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

2047 సంవత్సరానికల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం గా భారత్ ఆవిష్కృతం: ఎంపీపీ సాయి లీల ఉమా మహేష్

పాత ములకలచెరువు గ్రామంలో సజావుగా సాగిన వికసిత భారత్ కార్యక్రమం.. రవీందర్ రెడ్డి
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 18 తంబళ్లపల్లి : స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండలం పాతూరు పాత మొలకలచెరువు గ్రామ సచివాలయ పరిధిలో నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, ఎంపీపీ సాయి లీల ఉమా మహేష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బిల్లూరి విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్ మంజుల రామనాథం, ఎంపీపీ రఫీ, మండల వైసిపి ప్రత్యేక ఆహ్వానితుడు సిద్ధారెడ్డి సారధ్యంలో వికసిత భారత్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలైన అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ఉజ్వల యోజన, డిజిటల్ ఇండియా, జన్ దన్ యోజన, పీఎం కిసాన్ యోజన, ఆయుష్మాన్ భారత్, విశ్వకర్మ యోజన, ఉపాధిహామీ పథకం, జీవన సురక్ష మరియు జీవనజ్యోతి, గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (గ్రామీణ రహదారులు), మహిళా శిశు సంక్షేమము (అంగన్వాడీ), గ్రామీణ భూముల అధికారిక సర్వే 16. సమగ్ర శిక్ష మరియు ఆశ్రమ పాఠశాలలు (స్కూల్స్), పెన్షన్ పథకాలు మొదలైన వాటి గురించి లబ్ధిదారులకు వివరిస్తూ సభ నిర్వహించారు. 2047 వ సంవత్సరానికల్లా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఆవిష్కృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ములకలచెరువు పట్టణ సర్పంచ్ షేక్ రహమత్ బి, ఎంపీటీసీ అయేషా చాంద్ బాషా, ప్రజా ప్రతి నిధులు గోపాల్ రెడ్డి, జయరామి రెడ్డి, నగేష్, మంగరాజు, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమ కన్వీనర్ మనోహర్ గౌడ్,
మరియు ప్రజలు మండల అధికారులు పాల్గొన్నారు .

Related posts

Leave a Comment