గుంతకల్ ఫిబ్రవరి 8 జనసేన ప్రతినిధి : దిల్లీ అసెంబ్లీ ఎన్నకల్లో బీజేపీ విజయంపై పామిడి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. దిల్లీ పీఠాన్ని కమలనాథులు కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు పూజారి లక్ష్మీదేవి, యువ మోర్చా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, మండల అధ్యక్షుడు అంజి నాయక్ మాట్లాడుతూ ఆమ్మ్ ఆద్మీ పార్టీ అవినీతి పాలనకు చర్మ గీతం పాడి నరేంద్ర మోడీ అభివృద్ధి పాలనకు జై కొట్టారని అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పానికి దిల్లీ ప్రజలు మద్దతు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య, శ్రీధర్, ఆచారి, మనోజ్, పవన్, సునీల్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Related posts
- Comments
- Facebook comments