అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: ఈనెల 10వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Related posts
- Comments
- Facebook comments