మండల అభివృద్ధి అధికారి వి.అబ్రహీంలింకన్యు
వతకు మరియు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కృషి
మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు ప్రతిభ కేంద్రాలలో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు
సర్టిఫికెట్స్ ప్రధానం
కాకినాడ, జనసేన ప్రతినిధి, మే 3: యూ కొత్తపల్లి మండలం , మూలపేట అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిభ మరియు మహిళా అభివృద్ధి నైపుణ్య కేంద్రం లో శిక్షణ పూర్తిచేసుకున్న 61 మంది అభ్యర్థులకు మండల అభివృద్ధి అధికారి వి.అబ్రహీంలింకన్ మరియు ఎ శ్రీనివాస రావు, మేనేజర్, పి ఆర్ & ట్రైనింగ్స్ లైఫియస్ ఫార్మా చేతుల మీదుగా సర్టిఫికెట్లను ప్రధానం చేయడం జరిగింది.
కాకినాడ సెజ్ పరిధిలోగల గ్రామీణ యువతి యువకులకు “అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఉచితంగా నిపుణలైన కంప్యూటర్ ఫ్యాకల్టీ ద్వారా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం విద్య, కెరీర్ ప్లానింగ్ మరియు కోచింగ్‌లపై మార్గ నిర్దేశం చేయడం ద్వారా స్థానిక యువతి యువకులకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చి వారిని ప్రైవేట్ & ప్రభుత్వ రంగాలలో అవకాశాలకు పోటీపడేలా ప్రతిభ సెంటర్ మరియు మహిళా నైపుణ్య అభివృద్ధి కేంద్రం ద్వారా స్థానిక మహిళలకు తగిన నైపుణ్యాన్ని అందించే ఉదేశ్యంతో కుట్టుపని, చీర పెయింటింగ్, డిజైనర్ బ్లౌజ్‌లు కుట్టడం మొదలైన వాటిలో శిక్షణను ఇచ్చి వారి ఆర్థిక స్వాతంత్య్రానికి, సమాజంలో స్వతంత్రులుగా ఎదగడానికి, స్వావలంబన కలిగి, స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కేంద్రం ద్వారా అరబిందో ఫార్మా ఫౌండేషన్ కృషిచేస్తున్నది.
ఇంత మంచి అవకాశాలు కల్పిస్తున్న అరబిందో ఫార్మా ఫౌండేషన్ ను ఎంపీడీఓ అబ్రహీంలింకన్ అభినందించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్థానిక యువత సరైన శిక్షణ తీసుకొని మంచి నైపుణ్యాలు పెంపొందించుకున్న యువతకు చాలా మంచి అవకాశములు రాబోతున్నాయని అదేవిధంగా ప్రతిభ కేంద్రం ద్వారా శిక్షణ పొందిన యువతకు తమ సంస్థలో మొదటి ప్రాధాన్యతను ఇస్తామని ఈ సందర్భంగా అన్నారు. .
గ్రామీణ ప్రాంత యువతగా తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవడానికి ఎటువంటి సౌకర్యాలు లేని తమకు అన్ని సౌకర్యాలు కల్పించి నిపుణులైన శిక్షకులచే ఏంతో నాణ్యమైన శిక్షణను అందించి తమలో ఆత్మ విశ్వాసాన్ని నింపిన అరబిందో ఫౌండేషన్ వారికి ఈ సందర్బంగా మహిళలు, యువత తమ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.