పిఠాపురం, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 9: 84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవజన్మకు ముక్తి ద్వారానే సార్ధతకత కలుగుతుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం, కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యా త్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగ ణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆది వారం అత్యంత ఘనంగా ప్రారంభమ య్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వల నతో పీఠాధిపతి సభలను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవజన్మకు మాత్రమే ఉందని అన్నారు. ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవుని లోని మానసిక, శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని పేర్కొన్నారు. ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలు గుతారని తెలిపారు.
ముక్తిని పొందాలంటే కోరికలు లేని స్థితికి మానవుడు చేరుకోవాలని అందుకోసం గురువును ఆశ్రయించి
ఆధ్యాత్మిక, తాత్విక తత్వ జ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు
అందిస్తున్న జ్ఞాన, ధ్యాన, మంత్ర శక్తులతో కూడిన త్రయీ సాధనను ఆవలంభించడం ద్వారా భుక్తి, తృప్తి,
ముక్తి లభిస్తాయని తెలిపారు. మానవ జీవన పరిణామ క్రమంలో అండం పిండంగా మారే గర్భస్థ దశలో తాత్విక జీవన రసాయన తత్వం బాల్య దశలో తాత్విక బాలవికాస్ తత్వం, యవ్వన దశలో యువ వికాస్ తత్వం, కౌమార దశలో ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన తత్వం , వృద్దాప్య దశలో బ్రాంతి తత్వం నుండి ఈశ్వరత్వం తేలిపే తత్వాలను
పీఠం భోదిస్తుందని తెలిపారు. మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు.
సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జెడి, వివి.లక్ష్మీనారా యణ మాట్లాడుతూ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు పీఠా ధిపతి ఉమర్ ఆలీషా మహాసభల నిర్వహణ ద్వారా మేధోమధనం చేపట్టి మనుష్యులను కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందరనీ కలిపే తత్వం భారతీయ తత్వమని అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంఘాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతుడు ఆలీషా అని కొనియాడారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయాణం చేస్తే శిష్యుని జీవితం సార్ధకమౌతుంద ని, వెల్లడించారు. పీఠం విశిష్టతను మారుమూల పల్లెలవరకూ విస్తరింప చేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు.
అనంతరం నివేదిక 2025, పీఠం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తేలిపే ఆంగ్లము,తెలుగు బ్రోచర్ లను ముఖ్య అతిధులు సిబిఐ మాజీ జెడి, వివి.లక్ష్మీనారా యణ, కాకినాడ జిల్లా 3 వ అడిషనల్ జడ్జ్, పి.కమలాదేవి, నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ లచే పీఠాధిపతి సభలో ఆవిష్కరింప చేశారు. తదుపరి ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ షా, చింత పల్లి అమృతవల్లి, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, కె. స్వర్ణలత, డాక్టర్ ఎన్. రాంగోపాల్ వర్మ, ఎన్ ఆర్ ఐ సభ్యులు టి.ఎస్.వి. శ్రీనివాస్, సూర్య కుమార్, ఉషారాణి లు మాట్లాడుతూ సద్గురువుని ఆశ్ర యించి తాత్విక జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చునని తెలిపారు. గురువు ఆదేశాలను శిష్యులు పాటించాలని అన్నారు. పంచ భూతాల సహకారంతోనే మానవుని జీవితం కొనసాగుతుందని ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించి నిస్వార్ధ జీవనం కొనసాగిస్తూ కృత జ్ఞతను కలిగి ఉండాలని పేర్కొన్నారు
స్త్రీ సంక్షేమం, సర్వమత సౌభ్రాతృ త్వం కొరకు పీఠాధిపతులు చేస్తున్న కృషిని కొనియాడారు.
ఈ సందర్బంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్, జె ఎన్ టి యు, ప్రొఫెసర్ డాక్టర్ ఎల్. సుమలత, డాక్టర్ హరనాధ్ రాజు, సౌత్ సెంట్రల్ రైల్వే, సబర్బన్ ట్రైన్స్ జనరల్ సెక్రటరీ నూర్ అహ్మద్ ఆలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్ మేనేజర్ కె. సుధాకర్ రెడ్డి, యోగరత్న డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలు ,ప్రాధమిక వైద్య శిబిరాలు, సోలార్, డ్రోన్ స్టాల్స్ తో పాటుగా 32 కేంద్రాలను ఏర్పాటు చేసారు.
సభలో పాతూరి కొండలరెడ్డి ఆల పించిన పద్య గానం, తాత్విక బాలవికాస్ విద్యార్థులు నంద్యాల యశ్వంత్, బాదం ఊర్విషా ల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. సంగీత విభావరిలో ఉమాముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపచే సాయి. సభలో పాల్గొనడానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌక ర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 324 మంది నూతనంగా మంత్రోప దేశం పొందారు.
ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్ టివి వర్మ, ఎవివి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.