ఒంగోలు, జనసేన స్టాఫర్ (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక మల్లయ్య లింగం భవనం (సి.పి.ఐ ఆఫీసు) ఆవరణలో ఆదివారం కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖకవి, విశ్రాంత హిందీ అధ్యాపకులు, “సాహిత్యరత్న” పబ్బశెట్టి వెంకటేశ్వర్లు సంస్మరణసభ జరిగింది. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సభకు కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా రచనలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నిరూపించిన వ్యక్తి పబ్బశెట్టి వెంకటేశ్వర్లు అని గుర్తు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ వృత్తి రీత్యా హిందీ లెక్చరర్ అయినప్పటికీ చక్కటి తెలుగులో వసుధశతకం, పసిడి పలుకులు, వనగోపాలుడు (నాటిక), మానసబోధ, భక్తి గీతాలు, అమృత వాక్కులను పలు గ్రంథాలను రచించారని తెలిపారు.
మరొక అతిథిగా పాల్గొన్న నరసం రాష్ట్ర అధ్యక్షురాలు తేళ్ళ అరుణ మాట్లాడుతూ అమ్మభాషపట్ల మమతాను రాగాలను చూపిస్తూ, దైవభక్తి, దేశభక్తి, మాతృభాషానురక్తి కలిగేలా రచనలు చేయడం ఆయన విశిష్టతని తెలిపారు. సహజకవి శనగపల్లి సుబ్బారావు మాట్లాడుతూ సమాజంలో తరిగి పోతున్న మానవతా విలువలను గురించి విద్యార్థులు తెలుసుకునేలా ఉండే రచనలు చేశారని చెప్పారు. బాల సాహితీవేత్త మద్దిరాల శ్రీనివాసులు, ఆళ్ళచెరువు.సాంబశివరావులు వి.యన్.సుబ్రమణ్యేశ్వర శర్మలు ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు, ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య కోశాధికారి డా.సంతవేలూరి కోటేశ్వరరావు, ప్రముఖకవి యు.వి.రత్నం, పోతుల పెదవీరనారాయణ, నూతోటి.శరత్ బాబు మొదలగువారు ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడారు.
సభానంతరం నిర్వాహకులు మరియు ఆయన సతీమణి పబ్బిశెట్టి సత్యవతి, మనవడు కార్తీక్ వారి కుటుంబసభ్యులు వివిధరంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులైన రాయపాటి ఆశీర్వాదం, నిమ్మలవెంకయ్య,
పిన్ని వెంకటేశ్వర్లు, యం.వి.యస్.శాస్త్రి, మహతి తన్నీరు బాలాజీ, కప్పగంతు జయరామయ్య, ఆళ్ళ వెంకటేశ్వర్లు, నర్సింగోలు శ్రీనివాసప్రసాద్, చల్లా నాగేశ్వరమ్మ, ఆదూరిమనోహర, జంధ్యాల కామేశ్వరి, పరాంకుశం కృష్ణవేణ, జి.నాగేశ్వరరావు, మద్దిరాల సాంబశివరావు,షేక్ మగ్బుల్ అలీ, ఉప్పుటూరి మాధవరావు, బి.శ్రీనివాసరావు, ఉబ్బా అశోక్ బాబు, కోడూరి నాగేంద్ర, నారాయణం రఘు ప్రదీప్, షేక్ సంధానీ, బీరం అరుణ, బండారు సునీత, యన్ నాంచారమ్మ లను ఘనంగా సత్కారించారు.